విశాఖపట్నంలో ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ రంగాల పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు ప్రత్యేక ఎస్క్రో ఖాతాలు, సావరీన్ గ్యారెంటీ అందిస్తామని తెలిపారు.
“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నుంచి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు.
72 దేశాల నుంచి ప్రతినిధులు, 2,500 మంది పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యారని వివరించారు.
1)త్వరలోనే రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు.

2)ఏరోస్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ రంగాల్లో క్లస్టర్లు.

3)గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల లక్ష్యం.
4)గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు.

5)త్వరలో ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీల ప్రారంభం.
6) రేర్ ఎర్త్ మినరల్స్, పర్యాటకం, లాజిస్టిక్స్, అగ్రిటెక్, ఈవీ టెక్ రంగాల్లో అపార అవకాశాలు.
సదస్సు ప్రారంభోత్సవం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా జరిగింది.

