
విశాఖపట్నం: 30వ సిఐఐ సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ–విదేశ ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల అధికారులతో సీఎం భేటీ అవుతున్నారు.
సీఎం, రేమాండ్ ప్రాజెక్టుకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూలు కుదరనున్నాయి.
అదే విధంగా న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ సెషన్లలో సీఎం పాల్గొంటారు.
సీఎం సమక్షంలో ఇవాళ పెద్ద సంఖ్యలో కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు సన్నద్ధమయ్యాయి.

