హైదరాబాద్లో హైకోర్టు వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఘటన వెలుగుచూసింది. హైకోర్టు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే, పీడీఎఫ్ ఫైల్ బదులు BDG Slot అనే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంటున్నట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు హ్యాకింగ్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

