ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు విశాఖలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ, రాత్రి 10 తరువాత బీచ్‌లో ఉండటంపై పోలీసులు కేసులు పెడితే పర్యాటకులు ఎలా వస్తారు అని ప్రశ్నించారు. టూరిజం అభివృద్ధికి గోవా మాదిరిగా ఫ్రీ జోన్‌లు అవసరం ని సూచించారు.
అక్రమ లేఅవుట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, చెరువులు మరియు ప్రభుత్వ భూముల్లో అనుమతుల్లేకుండా వెంచర్లు వేసి ప్రజలను మోసం చేసే డెవలపర్లపై అధికారాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తోంది అని అన్నారు.

