Telengana :సౌదీ ప్రమాదంలో మరణించిన మన హైదరాబాదీలు

November 17, 2025 11:56 AM

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో అసిఫ్‌నగర్‌కు చెందిన 16 మంది కూడా మృతి చెందినట్లు సమాచారం.హైదరాబాద్‌ మల్లేపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీ ఉన్నారు.

ఉమ్రా కోసం మల్లేపల్లిలోని Al-Meena Travels మరియు Fly Zone Travels ద్వారా బుక్ చేసుకున్న 42 మంది ప్రయాణికులలో Al-Meena ద్వారా 16 మంది, Fly Zone ద్వారా 24 మంది ఉన్నట్లు తెలిసింది.

ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సౌదీలో చిక్కుకున్న తెలంగాణ పౌరుల వివరాలు సేకరించేందుకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

సమాచారం కోసం సంప్రదించవలసిన నంబర్లు:

📞 79979 59754

📞 99129 19545

ప్రమాదంపై సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో పాటు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సౌదీ అధికారులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media