
మంగళగిరి 28వ వార్డు బాపనయ్య నగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల కాపు కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన విన్నకోట శ్రీనివాసరావుకు నాయకులు ఘన సత్కారం నిర్వహించారు. పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గంలో కాపు వర్గంతో పాటు ఇతర వర్గాల్లో పార్టీ బలపడేందుకు విన్నకోట చేసిన సేవలను గుర్తించి డైరెక్టర్ పదవి ఇవ్వడం హర్షణీయమన్నారు. ఆయన ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తురక వీరశేఖర్, తోట కరుణకుమార్, కోలా శ్రీనివాసరావు, దొడ్డాకుల శ్రీనివాసరావు, గాజుల క్రాంతికుమార్, పసుపులేటి సదాశివరావు, సుంకర ప్రసాద్, షేక్ రజియా, కోలా వెంకటనారాయణ, తోట శరత్ తదితరులు పాల్గొన్నారు.