అమెరికన్ గాయకుడు అకాన్ నవంబర్ 14న బెంగళూరులో జరిగిన తన కచేరీలో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఆయన Sexy Bitch పాట పాడుతుండగా, VIP విభాగం వద్ద ఉన్న కొంతమంది అభిమానులు ముందు వరుస నుండి ఆయన ప్యాంట్‌ను లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. అసౌకర్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ అకాన్ శాంతంగా ప్రదర్శన కొనసాగించారు.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రవర్తన “అవమానకరమైనది”, “అంగీకారయోగ్యం(UNACCEPTABLE) కానిది” అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కళాకారులతో ఇల చేయడం దేశానికి చెడ్డపేరు తీసుకువస్తుందని పలువురు విమర్శించారు. భారతదేశంలో భారీ ఫ్యాన్‌బేస్ ఉన్న అకాన్‌కు ఇలా వ్యవహరించడం అభిమానులను నిరుత్సాహపరిచిందని పలువురు తెలిపారు.
అకాన్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో జరుగుతున్న ఇండియా టూర్‌లో పాల్గొంటున్నారు.

