
అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందే ఆడుకుంటున్న నాలుగేళ్ల అఖీలేశ్వర్‌పై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయాలు చేసింది.
తక్షణమే చిన్నారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గ్రామంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.