బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) స్థాపించిన జన సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా, తొలి ప్రయత్నంలోనే 3.4% ఓటు షేర్ సాధించి దృష్టిని ఆకర్షించింది.
రాష్ట్రవ్యాప్తంగా 238 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ, మొత్తం 16.77 లక్షలకు పైగా ఓట్లు సాధించింది. పోటీ చేసిన సీట్లలో 129 నియోజకవర్గాల్లో మూడో స్థానంలో, సరన్ జిల్లా మర్హౌరా స్థానంలో రెండో స్థానంలో నిలిచింది. అనేక చోట్ల ఎన్డీఏ–మహాఘట్బంధన్ అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఉదాహరణకు, చన్పాటియాలో యూట్యూబర్ మనీశ్ కశ్యప్ వచ్చిన 37,000 ఓట్లు బీజేపీ పరాజయానికి కారణమయ్యాయి.
పదేళ్లుగా బీహార్లో ఉన్న బీఎస్పీ (1.62%), ఎంఐఎం (1.85%),అసలు విషయం ఏంటంటే (5.1)vote percent ఉన్న పరాగ్ 19 సీట్స్ వచ్చాయి mim పార్టీ కి కూడా 5 ప్రదేశాల్లో గెలిచింది ఇది కచ్చితంగా evm స్కాం అని బీహార్ ప్రజలు వాపోతున్నారు ఈ విధంగా చుస్తే 9 % ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ 21సీట్లు గెలిచింది. వామపక్ష పార్టీల మొత్తం ఓట్లకంటే జన సురాజ్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం విశేషం. అయితే, 238 అభ్యర్థుల్లో 236 మంది డిపాజిట్లు కోల్పోయారు.
ఇంతటి ఓట్లను సాధించినప్పటికీ, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పార్టీని ‘ఇతరులు’ కేటగిరీలో చూపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
మొత్తం మీద, సీట్లు గెలవకపోయినా నిరుద్యోగం, వలసలు వంటి నిజమైన సమస్యలపై దృష్టి పెట్టిన జన సురాజ్ పార్టీ బీహార్ రాజకీయాల్లో బలమైన పునాది వేసినట్లు విశ్లేషకుల అభిప్రాయం.

