National :అస్సాంలో SIR : మళ్ళీ SCAM చేస్తారు అంటున్న విపక్షాలు

November 17, 2025 6:29 PM

న్నికల సంఘం (ECI) అస్సాంలో Special Intensive Revision (SIR) కోసం ఏర్పాట్లను అధికారికంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో BLOలకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

100 ఏళ్లు పైబడి ఉన్న ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించాలి ,ఒకే ఇంటిలో 10 మందికి పైగా ఓటర్లు ఉన్న గృహాలను నమోదు చేయాలి** అని సూచనలు ఇచ్చింది.

అస్సాం CEO అనురాగ్ గోయెల్ అన్ని EROలు, AEROలు, BLOలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 2023లో జరిగిన సీటు పునర్విభజన తర్వాత ఇది అస్సాంలో మొదటి పెద్ద రివిజన్.

BLOలు ఓటర్ల చిరునామా, ఫోటో, పౌరసత్వానికి సంబంధించిన ప్రమాణాలు సేకరించాల్సి ఉంటుంది. మరణించిన ఓటర్లను తొలగించడానికి మరణ ధ్రువపత్రాలు తప్పనిసరి అని చెప్పబడింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా సర్మా ఈ చర్యను స్వాగతిస్తూ, రాష్ట్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.ఈ డేటా ని మొత్తం తీసుకోని మల్లి వోట్ చోరీ కి పాల్పడతారు అని , బీహార్ ఎన్నికల తర్వాత ECI మీద పూర్తిగా నమ్మకం పోయిందని ప్రజలు వాపోతున్నారు ,మరి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అని తెలిసి కూడా ఈసీ ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ఒక వింత .


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media