ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. బుధవారం (నవంబర్ 19, 2025) హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ నివేదిక:
సిట్ నివేదిక ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సంబంధిత కంపెనీల పేరిట ఉన్న రూ.63.72 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి. ఈ ఆస్తులు లిక్కర్ స్కామ్‌లో వచ్చిన కమిషన్లు, కిక్‌బ్యాక్‌లతో సంపాదించబడినవని ప్రభుత్వం పేర్కొంది.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను రూ.8.85 కోట్లుగా చూపించి, అసలు విలువ రూ.63.72 కోట్లు కావడంతో రూ.54.87 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం.
అరబిందో ఫార్మా కేసు:
వెండోడు ప్రాంతంలో అరబిందో ఫార్మాకు చెందిన 263.28 ఎకరాల భూమి కొనుగోలు–అమ్మకాల్లో కేవీఎస్ ఇన్ఫ్రా చేసిన లావాదేవీల ద్వారా రూ.13.3 కోట్ల నల్లధనం తెల్లధనంగా మారినట్లు గుర్తింపు.విజయవాడ అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టులో ఆస్తుల అటాచ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీజీపీకి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

