నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్డుపై నిర్మించిన అక్రమ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెను తొలగించాలని కలెక్టర్ కృతికా శుక్లా మునిసిపల్ అధికారులకు ఆదేశించినా, అమలులో ఇబ్బందులు తలెత్తాయి.
సోమవారం అక్కడికి వెళ్లిన మునిసిపల్ సిబ్బందిని భవన నిర్మాణదారులు అడ్డుకోవడంతో, అధికారులు వెనుదిరిగారు. ఓ ప్రజాప్రతినిధి జోక్యం కూడా తొలగింపు చర్యలను నిలిపేసింది.
టీపీ వో సాంబయ్య మాట్లాడుతూ—మునిసిపల్ అనుమతులు లేకుండా నిర్మించిన ఈ అక్రమ దిమ్మె వాహన రాకపోకలకు అడ్డుగా మారిందని, దీని తొలగింపు కోసం శాఖకు ఇప్పటికే సూచించామని వెల్లడించారు.
