AP :అల్లూరి జిల్లా లో అందాల అరకులోయ

November 20, 2025 10:27 AM

ప్రస్తుత శీతాకాలంలో అరకులోయ కొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఎత్తైన పర్వతాలు, పచ్చదనం, దట్టమైన పొగమంచు, వలిసే పూల సోయగాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

1)మాడగడ సన్‌రైజ్ పాయింట్ – పాల సముద్రాన్ని తలపించే తెల్లటి మంచు దృశ్యాలు
2)గిరిజన మ్యూజియం – గిరిజన సంప్రదాయాల ప్రతిబింబం
3)పద్మాపురం ఉద్యానవనం – ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్

ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు పడిపోవడంతో అరకు చలి పర్యాటకులను గజగజలాడించినా, అదే సమయంలో వాతావరణాన్ని మరింత రొమాంటిక్‌గా మార్చుతోంది. కెమెరాలతో అరకు అందాలను బంధిస్తూ పర్యాటకులు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
అరకులోయలో ఈ సీజన్‌ వెడ్డింగ్ షూట్లు, పుట్టినరోజు వేడుకలతో సందడి వాతావరణం నెలకొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media