ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని చెన్నకేశవస్వామి చెరువులో శుక్రవారం చేపపిల్లలను వదిలిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి **డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడారు.
జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు, చెరువుల్లో 7 లక్షల చేపపిల్లలను వదలనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మంచి వర్షాలతో జలాశయాలు నిండినందున చేపపిల్లల పెంపకం మత్స్యకార సొసైటీలకు, గ్రామ పంచాయతీలకు ఆదాయం అందిస్తుందని చెప్పారు.
మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేట నిషేధకాలంలో ₹20,000 భృతి, వేటకు వెళ్లే మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.



