అనంతపురం సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ మాట్లాడుతూ, 11 ఏళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశాభివృద్ధి శూన్యమైందని విమర్శించారు.
బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక హక్కులను కాలరాసేలా సవరణ చట్టాలు తెచ్చారని పేర్కొన్నారు. దేశాన్ని లక్షల కోట్లు అప్పుల్లో ముంచి, మత మౌఢ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
రాజమౌళి, ఐశ్వర్య రాయ్ వంటి వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తే హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.
‘ఆపరేషన్ ఖగార్’ పేరిట నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతున్నారని, వారితో చర్చలు జరపకుండా ఖనిజాలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నమని రామకృష్ణ ఆరోపించారు.

