కర్నూలు జిల్లా ఆదోనిని జిల్లా గా, పెద్దహరివాణం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చేస్తున్న డిమాండ్ తీవ్రంగా మారుతోంది. ఆదోని జిల్లా సాధన కమిటీ నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తోంది.
వైకాపా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్ ఆదోని చేరుకుని దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఆదోని జిల్లా రూపుదిద్దుకుంటే ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని, ఆదోని కేంద్రంగా ప్రాంతాన్ని నాలుగు మండలాలుగా విభజిస్తే పరిపాలన సులభతరం అవుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యా, వైద్య సేవల కోసం ప్రజలు ప్రస్తుతం బళ్లారి, కర్నూలు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని శశికళ అన్నారు.

