మదనపల్లె మెడికల్ కాలేజ్ వద్ద టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. మెడికల్ కాలేజ్ PPP విధానం పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి చేసిన సవాల్‌ను టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు స్వీకరించడంతో ఇరు వర్గాలు తారసపడ్డాయి.
స్థలానికి భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ శ్రేణులు రోడ్డుపై తరిమి కొట్టిన ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నారు
