సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్ గూడెంలో తల్లి, కొడుకు సైకో మాదిరిగా ప్రవర్తించి కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేసిన ఘటన బయటపడింది. పొలం పంచాయితీ వివాదంలో భాగంగా కూతురు, అల్లుడు, ఇద్దరు మనుమరాళ్లపై ట్రాక్టర్‌తో దాడి చేశారు. మేనమామ తన అక్కను, అక్క కూతుళ్లను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఘటనలో బాధితులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హార్వెస్టర్ డ్రైవర్‌ను కూడా ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. అదే సమయంలో తల్లి పెట్రోల్ బాటిల్‌తో వరికోత మిషన్‌కు నిప్పంటిస్తానంటూ వీరంగం సృష్టించినట్లు స్థానికులు తెలిపారు.
నిందితుడు ఉపేందర్ రెడ్డి ఏపీ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి అని పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మునగాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
