నిజామాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశాయని విమర్శించారు.
విద్య, వైద్యం, ఉపాధి రంగాలు ఈ పార్టీల పాలనలో దెబ్బతిన్నాయని, ఇంకా కనీసం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుళజన రాజకీయ అధికారం సాధ్యమని, ఆర్ఎల్డీ యువతను రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సహిస్తుందన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత పాలనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడం ఇవి అన్నీ అసమర్థ పరిపాలన ఫలితమని దిలీప్‌కుమార్ విమర్శించారు.
బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
