AP :వేమూరులో ‘అన్నదాత సుఖీభవ’ ఇంటింటి ప్రచారం :ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు

November 25, 2025 10:31 AM

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ – ఇంటింటికి ప్రచారం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. గ్రామంలోని కాలనీల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

రైతుల ఆర్థిక భద్రత కోసం రూపొందించిన అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటివరకు రెండు విడతల్లో ₹14,000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రతి అర్హ కుటుంబానికి వార్షికంగా ₹20,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.

రైతుల వివరాల సేకరణ, అర్హత నిర్ధారణ అనంతరం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో రైతులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media