హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కోకాపేట మరోసారి రికార్డు సృష్టించింది. ప్రభుత్వ భూముల ఈ-వేలంలో ప్లాట్లు అద్భుతమైన ధరలను నమోదు చేశాయి.
ఈ వేలంలో ఎకరానికి ₹137.25 కోట్లు పలికి తాజా రికార్డును నెలకొల్పింది. ప్లాట్ నంబర్లు 17 (4.59 ఎకరాలు), 18 (5.31 ఎకరాలు) కలిపి మొత్తం 9.9 ఎకరాల కోసం భారీగా బిడ్లు వచ్చాయి.
ఈ రెండు ప్లాట్లకు పెట్టుబడిదారులు మొత్తం ₹1355.33 కోట్లు ఆఫర్ చేశారు. కోకాపేటలో భూములపై ఉన్న భారీ డిమాండ్‌ను ఈ వేలం మరోసారి స్పష్టం చేసింది.
