AP CM :రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తాను :బాబు గారి మాటలు

November 25, 2025 2:44 PM

రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగును ప్రోత్సహించడానికి సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్దేశం ఉద్యానవన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంపొందించడానికి సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా, గోడౌన్, పంచాయతీ రాజ్ రోడ్లు వంటి సదుపాయాలను అందించడం.

సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా 5.98 లక్షల ఉద్యాన రైతులకు లాభం కలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు.

మారుతున్న ఆహార అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, సాంకేతిక పరిజ్ఞానం వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించడానికి ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media