టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ 75వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు భారీగా హాజరై తమ సమస్యలను స్వయంగా మంత్రి వద్ద వినిపించారు. ప్రతి వినతిని వ్యక్తిగతంగా స్వీకరించిన లోకేష్, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

శ్రీకాకుళం: వైసీపీ పాలనలో తన ఇంటిని కూల్చివేశారని, అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ జరుగుళ్ల గురుమూర్తి న్యాయం కోరారు.

కర్నూలు: పగిడి వెంకటలక్ష్మి ఉద్యోగావకాశం కోసం అభ్యర్థించారు.

గుంటూరు (మంగళగిరి): కురగల్లి పాక్స్ సంఘంలో రూ.7.55 కోట్లు సీఈవో దుర్వినియోగం చేశారని సభ్యులు ఫిర్యాదు.
పెద్దవడ్లపూడి: వ్యవసాయ భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని కుర్రా వెంకట్రావు విజ్ఞప్తి.
రాష్ట్రవ్యాప్తంగా: రిటైర్డ్ పార్ట్‌టైమ్ ఉద్యోగుల పెన్షన్‌ను రూ.4,000 నుండి రూ.10,000 కు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్.
విజయనగరం: అనారోగ్యంతో ఉన్న తన కుమారుడి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ సాయం కోరిన నాగభూషణం.

పల్నాడు: దివ్యాంగురాలు షేక్ సుభాన్ బికి జీవనోపాధి కోసం ట్రై స్కూటీ సహాయం అభ్యర్థన.

అనంతపురం: పూర్తి అంగవైకల్యం ఉన్న మహాలక్ష్మి కు రూ.15,000 పెన్షన్ అందించాలని కోరారు.

ప్రతి విజ్ఞప్తిని శ్రద్ధగా పరిశీలిస్తామని, అవసరమైన అండ అందిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

