శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో రూ.1.68 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన భవనాలను పూర్తి చేసి బిల్లులు చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి అన్నారు.