అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటుందని. మంగళవారం ఆలయంలో ప్రారంభమైన షష్టి కల్యాణ మహోత్సవాల్లో ఆయన దంపతులతో కలిసి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. షష్టి కల్యాణం సందర్భంగా మూడు రోజులపాటు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా 2026 దేవాలయాల క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్, కేశఖండనశాల, టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణం జరుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

