S.V యూనివర్సిటీ పరిధిలో మరోసారి చిరుత సంచరించి కలకలం రేపింది. యూనివర్సిటీ ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న నాటుకోళ్ల షెడ్‌పై రాత్రి చిరుత దాడి చేసింది. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయింది.
యూనివర్సిటీ అధికారులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ను అటవీ శాఖ అధికారులకు అందజేశారు. క్యాంపస్‌లో తరచూ చిరుత సంచారం పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
