శ్రీకాకుళం, నవంబర్ 26: అక్రమ గంజాయి రవాణాపై ఇచ్చాపురం పోలీసులు భారీ స్థాయిలో దాడి నిర్వహించారు. రైల్లో సూరత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న రెండు మందిని పట్టుకుని, వారి వద్ద నుండి 29 కిలోల నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా గంజాం జిల్లా పట్టోపూర్‌కు చెందిన సంజుక్త దాస్, లోక్ నాథ్ ప్రధాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త మరణం తరువాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా సంజుక్త దాస్ గంజాయి రవాణాకు దారితీసిందని విచారణలో వెల్లడైంది. సూరత్‌లో పరిచయమైన రంజాన్ ప్రధాన్, కున్ని పండా ద్వారా పలుమార్లు గంజాయి వ్యాపారం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు.
వారి వద్ద గంజాయి ఉన్న బ్యాగులతో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు ఎక్కడానికి ప్రయత్నించిన సమయంలో ఎస్‌ఐ సిబ్బంది పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీఐ చిన్నం నాయుడు తెలిపారు.
