సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో RG-1 ఏరియాలోని జీఎం ఆఫీస్ ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. కార్మిక హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఓ టు జీఎంకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, IFTU రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ, SGLBKS రాష్ట్ర అధ్యక్షుడు జీ.రాములు, TNTUC నాయకుడు దామోదర్ రెడ్డి, IFTU రాష్ట్ర అధ్యక్షుడు కే.విశ్వనాథ్ మాట్లాడుతూ, లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను కుంచించేందుకు, కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. 12 గంటల పనిదినం అనుమతించడం దోపిడీ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

కార్మిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ధర్నాలో సారయ్య, దావూరమేష్, రత్నకుమార్, కొండి శ్రీనివాస్, గుండేటి మల్లేశం తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.
