రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్టు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి మెరుగైన ఫలితాలు ఇచ్చిందని, ఇప్పుడు ప్రారంభమైన పల్లె పండుగ 2.0 మరింత వేగాన్ని తెస్తుందని అన్నారు.
రాజోలులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన పల్లె పండుగ 2.0 సందర్భంగా డాక్టర్ బీఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అదనంగా రూ.100 కోట్లు ప్రకటించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో జిల్లా అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని ఎంపీ పేర్కొన్నారు.
