స్థానిక సంస్థల నామినేషన్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, తూప్రాన్‌పేట గ్రామాల్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ జెండా దిమ్మెలను కూల్చివేశారు.
ఒకేసారి రెండు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన వల్ల ఉద్రిక్తత నెలకొంది. జెండాలు కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం.
కూల్చివేతకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
