నరసరావుపేటలో మాజి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం రైతులపట్ల నిర్లక్ష్యం చూపుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్న నీ కోసం’ కార్యక్రమం పూర్తిగా డ్రామా మాత్రమేనని అన్నారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అరటి, మామిడి రేటు లేక రోడ్లపై పోయాల్సిన పరిస్థితి వచ్చిందని, నెల్లూరులో ధాన్యం కొనుగోలు చేసేవారు లేరని తెలిపారు. పల్నాడులో మొక్కజొన్న ధర క్వింటాకు గతంలో ₹2200 ఉండగా ఇప్పుడు ₹1600కి పడిపోయిందని విమర్శించారు.
పత్తి కొనుగోలు కేంద్రాలను సిసిఐ అరకొరగా ప్రారంభించిందని, మేథో తుఫానుతో 55 వేల ఎకరాల్లో నష్టం జరిగినా, కేవలం 4 వేల హెక్టార్ల నష్టం చూపారన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందలేదని గోపిరెడ్డి ఆరోపించారు.
సూపర్ సిక్స్, అన్నదాత సుఖీభవ, రాజధాని నిర్మాణం, పరిశ్రమలన్నీ డ్రామా మాత్రమేనని అన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణ న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు.
