ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో మాట్లాడుతూ—
రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతోందని, 24 గంటల్లోనే చెల్లింపులు జమ చేస్తున్నామని తెలిపారు.వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఇప్పటివరకు 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్రవ్యాప్తంగా సేకరణ. కృష్ణా జిల్లాలో 1.07 లక్షల టన్నులు రికార్డు స్థాయి సేకరణ. గోదావరి జిల్లాల్లో లక్ష టన్నులకు పైగా సేకరణ.
గత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో 2022–23లో 13,560 టన్నులు, 2023–24లో 16,978 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని, తమ ప్రభుత్వం 1,07,960 టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. రవాణా కోసం వైసీపీ కాలంలో 455 లారీలు మాత్రమే ఉంటే, కూటమి ప్రభుత్వం 2,715 లారీలు ఏర్పాటు చేసిందని వెల్లడించారు.ట్రాన్స్‌పోర్ట్ బకాయిల్లో 9 కోట్లు చెల్లించినట్టు చెప్పారు.
7.53 కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచి, అదనంగా 1 లక్ష సంచులు కూడా స్టాక్‌లో పెట్టారు.వాతావరణ మార్పుల కారణంగా ముందే ధాన్యం సేకరణ ప్రారంభించామని తెలిపారు. కేంద్ర నిబంధనల ప్రకారం 51 లక్షల MT వరకూ సేకరించేందుకు సిద్ధమని తెలిపారు.
