గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. MLA గల్లా మాధవి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మీడియాతో మాట్లాడుతూ,
1) ఫూలే సామాజిక సమానత్వం,
2) మహిళా విద్యా ప్రోత్సాహం,
3)కులవివక్ష వ్యతిరేక పోరాటాల్లో చేసిన సేవలను గుర్తుచేశారు.
స్త్రీలకు విద్య అందించడంలో ఫూలే ఎంతో గొప్ప మార్పు తీసుకువచ్చిన మహనీయుడని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో టిడిపి నాయకులు, బీసీ మహిళా నాయకులు పాల్గొన్నారు.
