శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ సభ్యులు శుక్రవారం శ్రీ కూర్మనాధ స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. ఆలయ విశిష్టత, చరిత్ర గురించి వేద పండితులు కమిటీ సభ్యులకు వివరించారు.

దర్శనంలో పాల్గొన్నవారిలో అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ,సభ్యులు డా. వివి సూర్యనారాయణ రాజు పెనుమత్స,వరుదు కళ్యాణి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్
అలాగే శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె. రాజా కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి. బిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి. చిరంజీవి, ఆలయ ఈఓ నర్సింహా నాయుడు, తహసీల్దార్ చక్రవర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
