Education :నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (NRF):అంటే ఏంటి

December 2, 2025 4:17 PM

నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (NRF) భారత పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఇది సైన్స్ & ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) స్థానంలో వచ్చింది.

NRF లక్ష్యాలు (Goals):

భారతదేశ అభివృద్ధి సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్-విభాగ పరిశోధనను (Interdisciplinary Research) ప్రోత్సహించడం.

పరిశోధనను విధానాలు మరియు ఆచరణలోకి అనువదించడం.

పరిశోధన పునరావృత్తిని తగ్గించడం.

ప్రధానమంత్రి NRF కు ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

బోర్డు: విద్య, సైన్స్ & టెక్నాలజీ కేంద్ర మంత్రులు వైస్ ప్రెసిడెంట్‌లుగా ఉంటారు. ఇందులో ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సహా 18 మంది సభ్యులు ఉంటారు.

అంచనాలు(prediction on future)

R&D పెట్టుబడి పెంపు 2030 నాటికి R&D లో పెట్టుబడిని GDP లో 0.7% నుంచి 2% కి పెంచడం.

పరిశోధన పెంపు ప్రపంచ శాస్త్రీయ ప్రచురణలలో భారతదేశ వాటాను 5% నుంచి 7% కి పెంచడం.

బడ్జెట్ కేటాయింపులు:

మొత్తం కేటాయింపు (2021-22 ) ఐదేళ్లలో రూ.50,000 కోట్లు కేటాయించాలని ప్రకటించారు. ఇందులో 28% (రూ.14,000 కోట్లు) ప్రభుత్వం నుంచి, 72% (రూ.36,000 కోట్లు) ప్రైవేట్ రంగం నుంచి సమకూర్చాల్సి ఉంది.

2025-26 బడ్జెట్: NRF కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు. (గతంలో 2024-25 బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావన లేదు.)


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media