జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా, జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు వ) విరహత్ అలీ విమర్శించారు.
డిమాండ్లు:
అక్రిడేషన్ కార్డులను వెంటనే అందించాలి.
చిన్న పత్రికలను ఆదుకోవాలి.
పత్రిక అడ్వర్టైజ్‌మెంట్ బిల్లులను చెల్లించాలి.
జర్నలిస్టులకు పక్కా ఇళ్ల స్థలాలు మరియు హెల్త్ కార్డులు అందించాలి.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
