అప్పులపాలైన ఓ వ్యాపారి ఎవరికీ చెప్పకుండా పరారైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి ఎల్లంకి శ్రీనివాస్ కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు తెలుస్తోంది.
వ్యాపారంలో నష్టాలు రావడంతోనే పరారీ అవుతున్నట్లు సదరు వ్యాపారి తన ఇంటికి నోటీసు అతికించి వెళ్లారు.

గత కొద్ది రోజులుగా అప్పులు ఇచ్చిన వ్యక్తులు, బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో శ్రీనివాస్ తన సూపర్ మార్కెట్కు తాళం వేసి, కుటుంబ సభ్యులతో సహా పరారయ్యారు.
సుమారు కోటి రూపాయలకు పైగా అప్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం రేపుతోంది.
