‘అఖండ 2’ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు.
నారాయణ వ్యాఖ్యలు:
సినిమా టికెట్ రేట్లు పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని, సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు.
సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్లే ‘ఐబొమ్మ రవి’ లాంటి వ్యక్తులు పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇలా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వానికి, ఐబొమ్మ రవి లాంటి వారిని అరెస్టు చేసే నైతిక హక్కు లేదని నారాయణ స్పష్టం చేశారు.