అనకాపల్లి జిల్లా, యలమంచిలి జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ మువ్వల రాంబాబు (బడే గుడి రాంబాబు) మాస్టారి అంకితభావం, సేవలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు.
బడినే గుడిగా భావించి, అంకిత భావంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న రాంబాబు మాస్టారికి మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ హైస్కూల్లో గతంలో 60 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను, సహ ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతో 130 మందికి చేర్చడంలో రాంబాబు మాస్టారి కృషి ప్రశంసనీయం.
తెలుగు బోధిస్తూ, తెలుగు పాఠ్య పుస్తకాలు రచిస్తూ… తెలుగు భాషా వికాసానికి పాటుపడుతూ, ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి కొనియాడారు.
