తాడేపల్లి మండలంలోని ఉండవల్లి పంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గమనించిన టీడీపీ నేతలు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గుంతలను పూడ్చి మరమ్మతులు చేశారు.
ఉండవల్లి పంచాయతీ ఆఫీస్ వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఈ మార్గంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ, గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు కునపరెడ్డి ప్రదీప్ వెంటనే స్పందించారు.
టీడీపీ నేతలు యుద్ధ ప్రాతిపదికన గుంతలకు మరమ్మతులు చేసి, రోడ్డును పునరుద్ధరించారు.
స్థానిక టీడీపీ నాయకులు చేసిన ఈ పనిపై వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఉండవల్లి గ్రామ అధ్యక్షులు వంగా నరేంద్ర, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, వినోద్, సాయి తదితరులు పాల్గొన్నారు.
