S.V జూపార్క్‌లో చికిత్స పొందుతూ ఏనుగు మున్నా మృతి
చిత్తూరు జిల్లా, గుడ్డివాని చెరువు వద్ద గాయపడిన స్థితిలో రక్షించబడి, ఎస్వీ జూపార్క్‌లో చికిత్స పొందుతున్న అడవి ఏనుగు ‘మున్నా’ (వయస్సు 25) మృతి చెందింది. రెండు రోజుల క్రితం గుడ్డివాని చెరువు ప్రాంతంలో గాయపడిన ఈ ఏనుగును కుంకీ ఏనుగులు మరియు క్రేన్ సహాయంతో ఎస్వీ జూపార్క్‌కు తరలించారు.

ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ఉంచి, అటవీ శాఖ మరియు జూపార్కు వైద్యులు మున్నాకు తీవ్రంగా వైద్యం అందించినప్పటికీ, ఫలితం దక్కలేదు.
పోస్టుమార్టం నిర్వహించిన వెటర్నరీ వైద్యులు, ఏనుగు ప్రాణాంతకమైన ‘సెప్టిసీమియా’ (Septicemia – రక్తంలో విషం వ్యాపించడం) కారణంగా మరణించినట్లు నివేదికలో తెలిపారు.

పోస్టుమార్టం అనంతరం జూపార్కు ప్రాంగణంలోనే సిబ్బంది మున్నాను ఖననం చేశారు.
