ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
పార్టీలకు అతీతంగా, అవసరమున్న ప్రతి డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
వచ్చే ఏడాది చివరినాటికి నియోజకవర్గ పరిధిలో ప్రధాన, అత్యవసర రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నాయిని హెచ్చరించారు.
అధికారులు సైతం జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, నాణ్యత ప్రమాణాల్లో తేడా వస్తే అధికారులు, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
