Telengana :దొరికిన మరో అవినీతి తిమింగలం :ACB raids

December 4, 2025 5:10 PM

ఆదాయానికి మించి ఆస్తులు (Disproportionate Assets) కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు.
శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ (AD), ల్యాండ్ రికార్డ్స్, రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా ఆరు చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం, రాయ్ దుర్గంలోని మై హోమ్ భూజా (My Home Bhooja) ప్రాంతాలలో సోదాలు చేశారు.
ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రైస్ మిల్లును కూడా అధికారులు గుర్తించారు. పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లుగా గుర్తించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media