Cinema :అఖండ 2: నిజంగానే తాండవం చేస్తుందా?

December 4, 2025 7:09 PM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ రేపు (డిసెంబర్ 5, శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

14 రీల్స్ ప్లస్, IVY ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. బాలయ్య మళ్లీ ద్విపాత్రాభినయం చేస్తుండగా, హీరోయిన్‌గా సంయుక్త మీనన్, మెయిన్ విలన్‌గా ఆది పినిశెట్టి నటించారు. ‘భజరంగీ భాయిజాన్’ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో సర్ప్రైజ్ ప్యాకేజీ అవుతుందని అంటున్నారు.తమన్ సంగీతం, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.ఈ సినిమా 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌తో, 3D, IMAX, 4DX సహా వివిధ ఫార్మాట్లలో థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే డే-2 ప్రీ-సేల్స్‌లో రూ. 3.9 కోట్లు గ్రాస్ చేసిందట. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ. 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను క్రాస్ చేయాల్సి ఉంది. పాన్ ఇండియా రిలీజ్ అంటూ భారీ హైప్ క్రియేట్ చేసినా, హిందీ వెర్షన్‌కు ఊహించని షాక్ తగిలింది.
ముంబైలో 10 షోలు కూడా దక్కలేదు, ఢిల్లీలో సింగిల్ షో కూడా లేదు. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్‌కు కేవలం 40 షోలు మాత్రమే కేటాయించారు. భారీ ప్రమోషన్ ఖర్చు పెట్టినా ఫలితం దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

సినిమా విడుదల సందర్భంగా ‘#Akhanda2Thaandavam’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. బాలయ్య అభిమానులు “జై బాలయ్య” నినాదాలతో సంబరాలు చేసుకుంటున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media