ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, ఆర్గానిక్ ఆధారిత పంటలను ఆహారంగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి రైతుల పంటల మేళాను ఆయన ప్రారంభించారు.

ఈ మేళాను ఏపీ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఎస్బీఐ, వారాహి ఫెడరేషన్, హలో వైజాగ్ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నగరాన్ని మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్గానిక్ పంటలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని వివరించారు. ఈ మేళాలో ఏర్పాటు చేసిన థింసా నృత్యం, కట్టె గానుగ, పుంగనూరు ఆవులు, కుమ్మరి సారి, అలాగే ಬುద్దుడు, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎక్జీక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు తమ సంస్థ ప్రకృతి వ్యవసాయంపై రైతులతో కలిసి పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తి, భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి సహా అనేకమంది ప్రకృతి రైతులు పాల్గొన్నారు.


