తిరుపతి జిల్లా పోలీసులు రేణిగుంట రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడిలో 10 కిలోల (5 ప్యాకెట్లు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుంది.
ఒడిశాకు చెందిన కైలాష్ బారిక (29) మరియు బాబు గౌడ్ (24) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులు ఈ గంజాయిని ఒడిశా నుంచి గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు.
డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రేణిగుంటను పూర్తిగా గంజాయి రహితంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రధాన సరఫరాదారు చాహల్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఆపరేషన్ను తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ జయచంద్ర బృందం విజయవంతం చేసింది.
డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజలు కూడా అనుమానాస్పద మత్తు పదార్థాల రవాణా గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
