AP బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ 10వ వార్షికోత్సవం

December 5, 2025 5:39 PM

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం బ్రాంచ్ కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

బ్రాంచ్ మేనేజర్ తాతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు.
ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని ఆమె కోరారు.సొసైటీలో ఖాతాదారులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని సూర్యప్రభ హామీ ఇచ్చారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సొసైటీ సమావేశానికి హాజరైన వేదుల సూర్యప్రభను బ్రాంచ్ సిబ్బంది సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ వడ్డాది ఉదయకుమార్, గంటి రవికుమార్, అందుకూరి కిరణ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media