బిదనపల్లి సమీపంలో కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఒకటి రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందలోకి దూసుకెళ్లడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు.

రైతు సరస్వతి తన గొర్రెలను తోలుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనతో రైతు సరస్వతి తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
