శబరిమల దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరం సమీపంలో నిన్న రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

మృతులు & బాధితులు:
ఈ ప్రమాదంలో దత్తిరాజేరు మండలం, గజపతినగరం మండలాలకు చెందిన మొత్తం ఐదుగురు ప్రయాణికులు చిక్కుకున్నారు.
1)వంగర రామకృష్ణ (51) – కోరపు కొత్తవలస, దత్తిరాజేరు
2)మార్పిన అప్పలనాయుడు (33) – కోరపు కొత్తవలస
3)మరాడ రాము (50) – కోరపు కొత్తవలస
4)బండారు చంద్ర రావు (35) – మరుపల్లి, గజపతినగరం

కోరపు కొత్తవలస గ్రామానికి చెందిన వ్యక్తి (వివరాలు సేకరిస్తున్నారు)శబరిమల యాత్ర ముగించుకుని వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో దత్తిరాజేరు, గజపతినగరం మండలాల్లోని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
