రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. విజయానంద్ గారు అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేడు (శనివారం) పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాలు మరియు అన్ని నెడ్‌క్యాప్ (NREDCAP) ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రధానంగా రైతులకు సౌర విద్యుత్ పంపుసెట్లు అందించే పీఎం కుసుమ్ పథకం, గృహాలకు సౌర విద్యుత్ అందించే పీఎం సూర్యఘర్ పథకం అమలు పురోగతిపై సమీక్ష జరిగింది.
సమావేశానికి ముందు, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సీఎస్, కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ & ఎండీ శివశంకర్ తోలేటి, జిల్లా ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సహా నెడ్‌క్యాప్ మరియు విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు
